News14th May 10:32 AMSunil Byrisetty1 min read

మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల‌కు రుణాలు

విజ‌య‌వాడ‌, విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల‌కు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప‌లు విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎం

మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల‌కు రుణాలు
విజ‌య‌వాడ‌, విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల‌కు రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప‌లు విదేశీ బ్యాంకుల ప్ర‌తినిధుల‌తో ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి స‌మావేశం నిర్వహిస్తున్నారు. స‌మావేశానికి KFW, AFD, ADB, NDB, AIIB, జైకా, ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌తినిధులు హాజ‌రయ్యారు. విజ‌య‌వాడ‌లో ప్ర‌తిపాదిత మెట్రో కారిడార్‌ల‌ను ఆయా బ్యాంకుల ప్ర‌తినిధులు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. రెండు మెట్రో ప్రాజెక్ట్ ల‌కు అయ్యే వ్య‌యంలో రూ. 12000 కోట్లు రుణం అవ‌స‌రం అవుతుంద‌ని అంచ‌నాలు ఉన్నాయి. విశాఖ మెట్రోకు 6100 కోట్లు,విజ‌య‌వాడ మెట్రోకు 5900 కోట్లు రుణం స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించారు. త‌క్కువ వ‌డ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకుల‌తో మెట్రో కార్పొరేష‌న్ ఎండీ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు.
vijayawada
visakhapatnam
metro rail
foreign banks
విజ‌య‌వాడ‌
విశాఖ‌ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ల‌కు రుణాలు
విదేశీ బ్యాంకులు
ఏపీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ ఎండీ రామ‌కృష్టారెడ్డి
Scroll for the next article