News19th Jan 11:21 AMSunil Byrisetty1 min read

పోలవరం ప్రాజెక్ట్ చేరుకున్న విదేశీ నిపుణుల బృందం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీనిపుణుల బృందం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి సోమవారం చేరుకుంది. బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల

పోలవరం ప్రాజెక్ట్   చేరుకున్న విదేశీ నిపుణుల బృందం
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు విదేశీనిపుణుల బృందం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి సోమవారం చేరుకుంది. బృందంలో విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకో ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఆరో విడత పర్యటిస్తున్నారు. వీరి వెంట కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని, సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని నిపుణుల బృందానికి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఏం ఈ ఐ ఎల్ ప్రతినిధులు వివరించారు.
Andhra Pradesh
Polavaram Project
Foreign Experts
Project Inspection
Water Resources Department
Central Water Commission
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
నిర్మాణ పురోగతి
ఏఎంఈఐఎల్
Scroll for the next article