News26th Sep 11:12 AMSunil Byrisetty1 min read
నిజంగా రావణుడే.. విచారణలో వాస్తవాలు!
యూట్యూబర్ రావణ్‌కు విదేశాల నుంచి భారీగా నిధులు అందినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, తప్పుడు ప్రచారాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో బయటకు లా
యూట్యూబర్ రావణ్‌కు విదేశాల నుంచి భారీగా నిధులు అందినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టడం, తప్పుడు ప్రచారాలు నిర్వహించడం వెనుక ఎవరున్నారో బయటకు లాగే ప్రయత్నంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అస్థిరపరచడమే లక్ష్యంగా సాగిన ఈ దుష్ప్రచారాలకు విదేశీ ఫండింగ్ తోడు కావడం విచారణలో వెలుగు చూసింది. ఈ కుట్రల వ్యూహంలో భాగంగానే అతనికి ఆర్థిక వనరులు సమకూరినట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. వైఎస్సార్‌సీపీ నేత ఇంద్రసేన రావణ్‌కు సుమారు పాతిక లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు, కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన ఖర్చులనూ భరించినట్లు విచారణలో తేలింది. హైదరాబాద్‌లోని నివాసంలో స్టూడియో ఏర్పాటుకు సహకరించడమే కాకుండా, ఈ ప్రచార రథాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇంద్రసేన ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచినట్లు స్పష్టమైంది. ఈ ఆర్థిక అండదండలతోనే రావణ్ కేవలం డిజిటల్ మాధ్యమాలకే పరిమితం కాకుండా, అత్యంత వ్యూహాత్మకంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కూడా రహస్యంగా వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.