News15th Sep 02:27 PMSunil Byrisetty1 min read

మాజీ ఉపముఖ్యమంత్రి కన్నుమూత!

మాజీ ఉపముఖ్యమంత్రి ‘ఆళ్ల నాని’ కన్నుమూశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్ల నాని కీలక బాధ్యతలు నిర్వహించారు. తొలుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాని అంచెలంచెలుగా

మాజీ ఉపముఖ్యమంత్రి కన్నుమూత!
మాజీ ఉపముఖ్యమంత్రి ‘ఆళ్ల నాని’ కన్నుమూశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆళ్ల నాని కీలక బాధ్యతలు నిర్వహించారు. తొలుత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాని అంచెలంచెలుగా ఎదిగారు. గోదావరి జిల్లాల్లో కీలక నేతగా ఎదిగిన నాని ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ హయాంలో ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా, వైద్య శాఖ మంత్రిగా సేవలు అందించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత సైలెంట్ అయిపోయిన ఆళ్ల నాని, అనంతరం టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినప్పటికీ నాని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. ఆళ్ల నాని మృతితో ఏలూరు జిల్లాలో విషాదం నెలకొంది.
Andhra Pradesh Politics
Alla Nani
Alla Kali Krishna Srinivas
Former Deputy Chief Minister
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
ఏలూరు
ఏలూరు జిల్లా
గోదావరి రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article