Politics23rd Oct 05:24 PMSunil Byrisetty1 min read
జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ ఎంపీ
2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిచిన గొడ్డేటి మాధవి మరోసారి వార్తల్లో నిలిచారు. 2019లో గెలిచిన మాధవికి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. మరో మహిళ, డా. తనూజ రాణికి వైసీపీ టికెట్ దక్కి
2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిచిన గొడ్డేటి మాధవి మరోసారి వార్తల్లో నిలిచారు. 2019లో గెలిచిన మాధవికి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. మరో మహిళ, డా. తనూజ రాణికి వైసీపీ టికెట్ దక్కింది. కూటమి ప్రభంజనంలోనూ ఆమె గెలిచారు. గొడ్డేటి మాధవికి అయితే పార్టీ పరంగా పదవులు ఇచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా మాధవి జెడ్పీటీసీగా నామినేషన్ వేసి సంచలనం సృష్టించారు. ఆమె కొయ్యూరు జెడ్పీటీసీగా వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఎంపీ స్థాయి నాయకురాలు ఒక మండల పరిధికి చెందిన జెడ్పీటీసీగా నామినేషన్ వేయడమేంటనిచర్చకు వస్తోంది. అరకు జెడ్పీ చైర్మన్ పదవికి ఆమెను వైసీపీ అధినాయకత్వం ప్రతిపాదిస్తోందని, అందుకే ఆమె జెడ్పీటీసీగా నామినేషన్ వేశారని అంటున్నారు.