Politics7th Sep 10:52 AMSunil Byrisetty1 min read
మాజీ సీఎం “అన్న”లకు బెయిల్ !
మాజీ సీఎం జగన్ అన్నా అని పిలిచే ముగ్గురికి బెయిల్ లభించింది. కృష్ణమోహన్ రెడ్డి అన్న, బాలాజీ గోవిందప్ప అన్న, ధనుంజయ్ రెడ్డి అన్న అని జగన్ పిలుచుకునే ముగ్గురికి లిక్కర్ కేసులో ఏసీబీ
మాజీ సీఎం జగన్ అన్నా అని పిలిచే ముగ్గురికి బెయిల్ లభించింది. కృష్ణమోహన్ రెడ్డి అన్న, బాలాజీ గోవిందప్ప అన్న, ధనుంజయ్ రెడ్డి అన్న అని జగన్ పిలుచుకునే ముగ్గురికి లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన కాసేపటికే వీరికి బెయిల్ మంజూరైంది. రూ.1 లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించి , తమ పాస్‌పోర్టులను కోర్టుకు ఇవ్వాలని ఆదేశించింది. మద్యం కుంభకోణాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రెండు చార్జ్‌షీట్లు దాఖలు చేశారు. ఆగస్టు 18న ఈ నిందితుల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. 90 రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత డిఫాల్ట్ బెయిల్ కోసం దరఖాస్తు చేసిన సమయంలో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.