Politics27th Aug 11:33 AMSunil Byrisetty1 min read

మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి గవర్నర్ పదవి?

దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లు మారనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మ

మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డికి గవర్నర్ పదవి?
దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లు మారనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని బీజేపీ నేతలకు అదనపు మంత్రి పదవుల అవకాశాలు లేకపోవడంతో, సీనియర్‌ నేత అయిన కిరణ్ కుమార్ రెడ్డిని లోక్‌భవన్‌కు పంపే ప్రతిపాదనలు ఢిల్లీలో ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మినహా కిరుణ్ కుమార్ రెడ్డి పెద్దగా యాక్టివ్‌గా లేరు. అయినప్పటికీ మాజీ సీఎంగా ఆయనకున్న అనుభవాన్ని గవర్నర్ గా ఉపయోగించుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh Politics
Kiran Kumar Reddy
Former Chief Minister
Governor Post
Governor Appointments
BJP
Union Cabinet Reshuffle
తెలంగాణ రాజకీయాలు
బీజేపీ నాయకత్వం
కేంద్ర ప్రభుత్వం
రాజకీయ పరిణామాలు
భారత రాజకీయాలు
Scroll for the next article