Politics22nd Apr 03:38 PMSunil Byrisetty1 min read
చంద్రబాబువి దుర్మార్గపు సంప్రదాయాలు!
తాడేపల్లి YCP కార్యాలయంలో ఆ పార్టీ పీఏసీ సభ్యులతో జగన్ సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలన్న వైఎస్ జగన్, బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించ
తాడేపల్లి YCP కార్యాలయంలో ఆ పార్టీ పీఏసీ సభ్యులతో జగన్ సమావేశం నిర్వహించారు.
గ్రామస్థాయికి కూడా పార్టీ వెళ్లాలన్న వైఎస్ జగన్, బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రజల తరపున పోరాటాలు మరింత ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దన్నారు.
విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని.. ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టారన్నారు.
లులూ గ్రూప్‌కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు.
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని, IPS ఆంజనేయులు అరెస్ట్ పరాకాష్టకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని మండిపడ్డారు.
పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.