News12th Nov 05:14 PMSunil Byrisetty1 min read

ఏబీవీ, జాస్తిలకు క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాష్

వైసీపీ ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరించిన విశ్రాంత ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జనగ్ హయాంలో ఉన్నతాధికారులు ఏబీ వెంకటేశ్వరరావు,

ఏబీవీ, జాస్తిలకు క్షమాపణ చెప్పిన ప్రవీణ్ ప్రకాష్
వైసీపీ ప్రభుత్వంలో అంతా తానై వ్యవహరించిన విశ్రాంత ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జనగ్ హయాంలో ఉన్నతాధికారులు ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్‌లకు అన్యాయం జరుగుతూంటే ఆపలేకపోయాయనన్నారు. ఏబీవీని 2019లో సస్పెండ్ చేయడం, జాస్తి కృష్ణకిషోర్‌పై APEDBలో ఆరోపణలు, సస్పెన్షన్ వంటివి రాజకీయ ప్రతీకారం కోసమే అని ఆయన స్పష్టం చేశారు. వారికి జరిగిన అన్యాయాన్ని ఆపలేకపోయానన్నారు. నేను ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఈ అన్యాయాలను అడ్డుకోవడానికి ప్రయత్నించాను కానీ సక్సెస్ కాలేదని, అది తన తప్పు అని, అందుకే పబ్లిక్‌గా క్షమాపణ చెబుతున్నాను అని భావోద్వేగంతో వీడియోలో ప్రకటించారు. YSRCP హయాంలో అనేక మంది IAS, IPS అధికారులపై రాజకీయ కారణాలతో చర్యలు తీసుకున్నారని, అది సరైనది కాదన్నారు.
Andhra Pradesh
Praveen Prakash
AB Venkateswara Rao
Jasti Krishna Kishore
YSRCP
AP Politics
Bureaucrats
సస్పెన్షన్
క్షమాపణ
ఐఏఎస్‌ అఫీసర్లు
రాజకీయ పరమైన పీడనం
Scroll for the next article