Politics10th Apr 08:52 AMSunil Byrisetty1 min read

జగన్ ఇంకెప్పుడూ అధికారంలోకి రాకూడదు.. ఏబీవీ సంచలనం

మాజీ సీఎం జగన్ అనే భూతం ఇప్పటికీ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంకెప్పుడూ అధికారంలోకి రాకూడదని X వేదికగా ఒక పోస

జగన్ ఇంకెప్పుడూ అధికారంలోకి రాకూడదు.. ఏబీవీ సంచలనం
మాజీ సీఎం జగన్ అనే భూతం ఇప్పటికీ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంకెప్పుడూ అధికారంలోకి రాకూడదని X వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంలో తానెదుర్కొన్న ఇబ్బందులపై తరచూ వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. ’నేను ఇంజినీరింగ్ చదువుకుని తొలుత టాటామోటార్స్ లో ఉద్యోగం చేశానని గుర్తుచేసుకున్నారు.. అదే సంస్థలో ఉన్నా లేక అమెరికా వెళ్లిఉన్నా ఇప్పుడు నా జీవితం వేరే విధంగా ఉండేదన్నారు. దుష్ట శిక్షణ -శిష్టరక్షణ చేసేందుకు తన రిటైర్డ్ జీవితంలో అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. ఐపీఎస్‌గా అధర్మాన్ని, అన్యాయాన్ని, అణచివేతను ఎదుర్కోవడం వృత్తిధర్మంగా పనిచేశానన్నారు. రిటైర్ అయినా జీవితం ఉన్నంతవరకు ప్రజా సేవలో ఉంటానని ఏబీ‌ వెంకటేశ్వరరావు ప్రకటించారు.
AB Venkateswara Rao
AP Politics
YS Jagan
వైసీపీ ప్రభుత్వం
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
Scroll for the next article