News31st Aug 05:33 PMSunil Byrisetty1 min read
హైకోర్టులో వాదించబోతున్న మాజీ ఐపీఎస్
పోలవరం జాతీయ ప్రాజెక్టు లోపాల మయంగా మారిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. రిటైరైన తర్వాత సెంటర్ ఫర్ లిబర్టీ పేరుతో ప్రభుత్వంపై ఆయన గళమెత్తుతున్న విషయం తె
పోలవరం జాతీయ ప్రాజెక్టు లోపాల మయంగా మారిందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. రిటైరైన తర్వాత సెంటర్ ఫర్ లిబర్టీ పేరుతో ప్రభుత్వంపై ఆయన గళమెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టులోని లోపాల కారణంగా ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతుందని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఆయన హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా తప్పులు జరిగాయని, వాటి మూలంగా డ్యాంకి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చమని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆదేశించమని కోర్టును ఏబీవీ కోరుతున్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ లిబర్టీలో ఆయన సహచరుడు నల్లమోతు చక్రవర్తి ట్వీట్ చేశారు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారే అవకాశాలున్నాయి.