News4th Aug 02:12 PMSunil Byrisetty1 min read

జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత!

జార్ఖండ్ శిఖరం నేలకొరిగింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు శిబూ సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ సంబంధి

జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత!
జార్ఖండ్ శిఖరం నేలకొరిగింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు శిబూ సోరెన్ (81) సోమవారం ఉదయం కన్నుమూశారు. ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కిడ్నీ సంబంధిత సమస్యతో శిబు సోరెన్ ఆసుపత్రిలో చేరారు. గురూజీ అని ముద్దుగా పిలువబడే సోరెన్.. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గిరిజన, అణగారిని వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు.ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆయన కుమారుడు. తన తండ్రి మరణాన్ని ధ్రువీకరిస్తూ హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. ప్రియమైన దిశోం గురూజీ మనల్ని విడిచిపెట్టారు. ఈ రోజు నేను ప్రతిదీ కోల్పోయాను” అని ఆయన పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆస్పత్రికి వెళ్లి శిబు సోరెన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. శిబూ సోరెన్ మృతిపై ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
India news
Jharkhand
Shibu Soren
Hemant Soren
tribal rights
JMM
former Chief Minister
kidney ailment
Delhi hospital
political leader death
జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత
Scroll for the next article