Crime21st Apr 10:34 AMSunil Byrisetty1 min read
కర్ణాటకలో ఘోరం.. ఏకంగా మాజీ డీజీపీ హత్య
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. ఏకంగా మాజీ పోలీస్ చీఫ్ హత్య జరిగింది. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు డీ
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది.
ఏకంగా మాజీ పోలీస్ చీఫ్ హత్య జరిగింది.
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ తన నివాసంలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు డీజీపీ ఒంటిపై కత్తి పోట్లను గుర్తించారు.
ఈ క్రమంలో ఆయన భార్య పల్లవినే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం పల్లవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కాగా ప్రకాశ్‌కు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడుతున్నట్లు సమాచారం.
ప్రకాశ్ వేధింపులపైనా పల్లవి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ప్రకాశ్ 2017లో పదవీ విరమణ పొందారు.