Politics12th Nov 01:53 PMSunil Byrisetty1 min read

పోలీసులపై రెచ్చిపోయిన అంబటి

మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో గుంటూరు

పోలీసులపై రెచ్చిపోయిన అంబటి
మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులపై రెచ్చిపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో గుంటూరులో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే, ర్యాలీకి అనుమతి లేదని వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నాడు. దీంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరికొకరు వేళ్లు చూపించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన అంబటిపై పోలీసులు కేసు నమోదు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh
Ambati Rambabu
Guntur
Police Clash
YSRCP
Protest
Medical College Privatization
Law and Order
వైరల్ వీడియో
రాజకీయ వివాదం
నిరసన
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
Scroll for the next article