Politics30th Aug 12:42 PMSunil Byrisetty1 min read

అంబటి రాంబాబు గుండెకు స్టంట్లు

వైసీపీ నేత, మాజీ మంత్రి, అంబటి రాంబాబు గుండెకు వైద్యులు స్టంట్లు అమర్చారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్‌ల

అంబటి రాంబాబు గుండెకు స్టంట్లు
వైసీపీ నేత, మాజీ మంత్రి, అంబటి రాంబాబు గుండెకు వైద్యులు స్టంట్లు అమర్చారు. దీంతో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరిన అంబటి రాంబాబుకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అపోలో వైద్యులు తనకు మెరుగైన చికిత్స అందించారని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే తాను ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని జగన్‌కు వివరించారు. ప్రస్తుతం రాంబాబును వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
Andhra Pradesh Politics
Ambati Rambabu
YSRCP
Former Minister
YS Jagan Mohan Reddy
Heart Treatment
Heart Stent
Apollo Hospital Hyderabad
Hyderabad News
ఏపీ పాలిటిక్స్
ఆరోగ్య వార్తలు
రాజకీయ వార్తలు
అంబటి రాంబాబు ఆరోగ్యం
వైఎస్సార్సీపీ
Scroll for the next article