Politics13th Mar 11:51 AMSunil Byrisetty1 min read

జగన్ గెలిచుంటే ఇలాగే మాట్లాడేవారా?

విజయసాయి విమర్శలకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి నేరుగా వైసీపీపై విమర్శలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

జగన్ గెలిచుంటే ఇలాగే మాట్లాడేవారా?
విజయసాయి విమర్శలకు మాజీ మంత్రి అమర్‌నాథ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విజయవాడలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి నేరుగా వైసీపీపై విమర్శలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ స్పందించారు. జగన్‌ కోటరీ అంటే ఈ రాష్ట్రంలో వైసీపీయేనన్నారు. కోటరీ ఎవరికి ఉండదని, చంద్రబాబుకు కోటరీ లేదా అని ప్రశ్నించారు. విజయసాయికి ఎవరి మీద ప్రేమ పుట్టిందోనని, 2024లో జగన్ అధికారంలోకి వచ్చిఉంటే ఇలా మాట్లాడేవారా అనడిగారు. విజయసాయి ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. విజయవాడలో మాట్లాడిన మాటలకు తేడా ఉందన్నారు. విజయసాయి వ్యవసాయం చేయరని.. రాజకీయమే చేస్తారని.. ఆయన వ్యాఖ్యలతో అర్థమైందని గుడివాడ అమర్‌నాథ్‌ కౌంటరిచ్చారు.
AP Politics
CM ChandrababuNaidu
Gudivada Amarnath
Vijaya Sai Reddy
YS Jagan
విజయసాయి
అమర్‌నాథ్‌
జగన్
Scroll for the next article