Politics19th Jul 02:10 PMSunil Byrisetty1 min read

కొండల్ని కొల్లగొడుతున్నారు

యలమంచిలిలో పురాతన దివ్యక్షేత్రం ఉమా ధర్మలింగేశ్వరస్వామి వారి ఆలయం వెలసిన పంచదార్ల కొండను ఎంపీ సీఎం రమేష్‌ కొల్ల గొడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌ అయ్యారు. అక్కడ కూ

కొండల్ని కొల్లగొడుతున్నారు
యలమంచిలిలో పురాతన దివ్యక్షేత్రం ఉమా ధర్మలింగేశ్వరస్వామి వారి ఆలయం వెలసిన పంచదార్ల కొండను ఎంపీ సీఎం రమేష్‌ కొల్ల గొడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఫైర్‌ అయ్యారు. అక్కడ కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ మంగళవారం ‘ఛలో పంచదార్ల’ చేపడుతున్నట్లు ప్రకటించారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ సాగిస్తున్న అక్రమ మైనింగ్‌ ద్వారా వేల కోట్లు దోచుకుంటున్నారని, ఈ వ్యవహారాన్ని ప్రజలు ముందు పెడతామని తెలిపారు. సీఎం రమేష్‌ తన పీఏ విజయ్‌కుమార్‌ నాయుడు పేరిట మే నెలలో రెండున్నర హెక్టార్లు లీజుకు ఇప్పించడంతో పాటు, మరికొందరికి అడ్డగోలుగా పర్మిట్లు ఇచ్చేలా చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. అప్పటి నుంచి పగలు, రాత్రి మైనింగ్‌ చేస్తూ, వేలాది లారీల్లో గ్రావెల్‌ తరలిస్తున్నారని, పర్మిట్‌ తీసుకున్న హద్దులు దాటి అపరిమితంగా తవ్వేస్తున్నారని ఆరోపించారు. భూమికి కిందన 70 అడుగులు మేర, కొండకు 60 నుంచి 70 అడుగుల మేర అడ్డగోలుగా మైనింగ్‌ సాగించడంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మలింగేశ్వరస్వామి వారి పవిత్రతకు దెబ్బ తీశారని, ఇంకా అక్రమ మైనింగ్‌ వల్ల అక్కడి పంచదార్ల నుంచి పవిత్ర నీటికి బదులు బురుద నీరు వస్తోందని చెప్పారు.
Andhra Pradesh
Gudivada Amarnath
CM Ramesh
Panchadarla
Illegal Mining
Anakapalli
YSRCP
ధర్మలింగేశ్వరస్వామి ఆలయం
రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article