Politics30th Jun 04:43 PMSunil Byrisetty1 min read
జమిలి ఎన్నికలకు సిద్ధమవ్వండి
లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కలిపి జమిలి ఎన్నికలు 2027లో నిర్వహించే అవకాశముందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక కేంద్రమంత్రి జమిలి గుర
లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి కలిపి జమిలి ఎన్నికలు 2027లో నిర్వహించే అవకాశముందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక కేంద్రమంత్రి జమిలి గురించి చెబుతున్నారని తెలిపారు. ఆ మేరకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ నాయకులకు సూచించారు. కర్నూలులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.కోట్ల నిధులు వెచ్చిస్తూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.