Politics5th Jul 03:00 PMSunil Byrisetty1 min read
రాజకీయాల్లో సినిమా డైలాగులు చెబుతున్న పవన్
రాజకీయాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇస్తున్న స్పీచ్లన్నీ సినిమా డైలాగులేనని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. రాష్ట్రంలో ఏడాది నుంచి రాజకీయ దాడులు
రాజకీయాల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇస్తున్న స్పీచ్లన్నీ సినిమా డైలాగులేనని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య(నాని) విమర్శించారు. రాష్ట్రంలో ఏడాది నుంచి రాజకీయ దాడులు జరుగుతున్నాయని అన్నారు. జగన్ పర్యటనల్లో పోస్టర్లను చూపిస్తున్న వారిని తప్పుపడుతున్నారన్నారు. మరి అలాంటి వారికి జరుగుతున్న దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. షూటింగ్లో ఉండే పవన్ కల్యాణ్ చిక్కడు.. దొరకడని ఎద్దేవా చేశారు. జగన్ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ ఎవరని, ఆయన శాఖలో ఏం జరుగుతోందో పవన్కు తెలుసా అని పేర్ని నిలదీశారు.