Politics12th Nov 05:53 PMSunil Byrisetty1 min read
మాజీ మంత్రి కన్నుమూత.. విషాదంలో టీడీపీ
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. 1948 ఆగస్ట్ 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు 1978లో తొలిసారి ఎమ్మెల్
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (78) కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు. 1948 ఆగస్ట్ 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శత్రుచర్ల, మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. వైఎస్ కేబినెట్లో అటవీశాఖ మంత్రిగా చేసిన శత్రుచర్ల, అనంతరం రోశయ్య హయాంలో రవాణాశాఖ మంత్రిగా పని చేసిశారు. 2017లో టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన శత్రుచర్ల పలు కీలక పదవులు నిర్వహించారు. సీనియర్ నేత శత్రుచర్ల కన్నుమూయడంతో టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.