News21st Oct 05:50 PMSunil Byrisetty1 min read

గ్లాసును పోలిన బకెట్.. గుర్తుపై నిషేధం

స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ‘బకెట్‌’, ‘పెన్‌స్టాండ్‌’ గుర్తులను స్వతంత్ర అభ్యర్థుల

గ్లాసును పోలిన బకెట్.. గుర్తుపై నిషేధం
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే ఎన్నికల గుర్తుల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ‘బకెట్‌’, ‘పెన్‌స్టాండ్‌’ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే జాబితా నుంచి తాత్కాలికంగా తొలగించింది. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జనసేన పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులకు బకెట్‌, పెన్‌స్టాండ్‌ గుర్తులు కేటాయిస్తే.. తమ పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాస్‌’తో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని జనసేన ప్రతినిధులు ఎస్‌ఈసీ పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్‌ఈసీ.. ఈ రెండు గుర్తులను తాత్కాలికంగా పక్కన పెట్టింది.
Scroll for the next article