Crime15th Mar 11:39 AMSunil Byrisetty1 min read

ఆరేళ్లయినా న్యాయం జరగలేదు.. గవర్నర్ వద్దకు సునీత

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని ఆయన కుమార్తె వైయస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరేళ్లయినా న్యాయం జరగలేదు.. గవర్నర్ వద్దకు సునీత
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. హత్య జరిగి ఆరేళ్లు అయినా న్యాయం జరగడం లేదని ఆయన కుమార్తె వైయస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ వివేకా ఆరో వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి మాట్లాడుతూ ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితులకన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామన్నారు. ఇన్వెస్టిగేషన్, ట్రయల్ లో లోపాలు జరిగాయని తెలిపారు. అందుకే ఈరోజు సాయంత్రం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. విచారణ నిష్పక్షపాతంగా జరపాలని కోరతానన్నారు. ఆరేళ్లుగా సీబీఐ, సిట్ విచారణ వల్ల న్యాయం జరగలేదని గవర్నర్ కు సునీత ఫిర్యాదు చేయనున్నారు.
YS Vivekananda Reddy
YS Sunitha
murder
justice
వైయస్ వివేకానంద రెడ్డి
సునీత
న్యాయం
Scroll for the next article