Politics18th Sep 04:53 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శలు
సీఎం చంద్రబాబుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. చంద్రబాబు డబ్బులున్న వారికే MLA, MLC, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలకు చిన్నచ
సీఎం చంద్రబాబుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. చంద్రబాబు డబ్బులున్న వారికే MLA, MLC, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ముస్లింలకు చిన్నచిన్న నామినేటెడ్ పోస్టులు, అవి కూడా మైనారిటీలకు ఇవ్వాల్సినవి ఇచ్చి సరిపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ముగ్గురు, నలుగురు ముస్లింలకు రావాల్సిన సీట్లు ఇవ్వలేదన్నారు. 2019లో తన కుమార్తె ఓటమికి కుట్రలు చేశారని ఆరోపించారు. TDPలో యాక్షన్ ఉండదు.. రియాక్షన్ అంతకంటే ఉండదని, అందుకే ఓటమికి కారకులైన వారి పేర్లు బయటపెట్టలేదని వ్యాఖ్యానించారు. ఈసారి విజయవాడ మేయర్ గా ముస్లింలకు, మహిళ అయితే తన కుమార్తెకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింల విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఈ నిర్లక్ష్యానికి ఫలితం వచ్చే ఎన్నికల్లో TDP పై పడుతుందని వ్యాఖ్యానించారు.