Politics19th Sep 11:52 AMSunil Byrisetty1 min read

లిక్కర్ కేసులో కీలక అప్డేట్.. జగన్ అరెస్ట్ అవుతారా?

లిక్కర్ స్కాం కేసులో వైసీపీ అధినేత జగన్ ను ఫిక్స్ చేసేలా మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్‌ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. డిస్టిలరీస్‌ నుంచి నెలకు రూ.50–60 కోట్ల వరకు ముడుపులు వసూలు చేసినట్లు ఆయన

లిక్కర్ కేసులో కీలక అప్డేట్.. జగన్ అరెస్ట్ అవుతారా?
లిక్కర్ స్కాం కేసులో వైసీపీ అధినేత జగన్ ను ఫిక్స్ చేసేలా మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్‌ సంచలన వాంగ్మూలం ఇచ్చారు. డిస్టిలరీస్‌ నుంచి నెలకు రూ.50–60 కోట్ల వరకు ముడుపులు వసూలు చేసినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. ఒక్కో మద్యం కేసుపై కనీసం రూ.300 వసూలు చేసి కొందరు నేతలు పంచుకుని.. మిగతా మొత్తం జగన్‌కు చేరవేసేవారని సత్యప్రసాద్‌ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే వాంగ్మూలంలో సత్యప్రసాద్ చేసిన ఆరోపణలు కోర్టులో నిరూపితం కావాల్సి ఉంది. అప్రూవర్‌గా మారుతానని చెప్పిన మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్‌ ఏకంగా జగన్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారుతోంది. ఈ వాంగ్మూలంతో జగన్‌ అరెస్ట్‌ అవుతారా? లేక నిరూపించలేక కేవలం ఆరోపణలే మిగులుతాయా అనేది తేలాల్సి ఉంది.
Scroll for the next article