Politics21st Oct 02:37 PMSunil Byrisetty1 min read

వైసీపీ మేయర్ అభ్యర్థిగా టీడీపీ నేత !

శ్రీకాకుళం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన ఆమెకు గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. కూటమి ప్రభుత్వంలో తను ఆశించిన ప్రాధాన్య

వైసీపీ మేయర్ అభ్యర్థిగా టీడీపీ నేత !
శ్రీకాకుళం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మి దేవి పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే అయిన ఆమెకు గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. కూటమి ప్రభుత్వంలో తను ఆశించిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు. పొత్తులో భాగంగా మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. అదే సమయంలో వైసీపీ నుంచి ఆమెకు మేయర్ ఆఫర్ వచ్చింది. మేయర్ టిక్కెట్ ఇస్తామని ఆశపెట్టడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. సుమారు 40 ఏళ్ల పాటు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయకత్వం వరకు టీడీపీ అభివృద్ధి కోసం తన కుటుంబం అంకితమై పనిచేసిందని, అలాంటి పార్టీని ఇప్పుడు వీడాల్సి రావడం ఎంతో బాధగా ఉందని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు రంగంలోకి దిగి గుండ లక్ష్మీదేవిని పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేశారు. నగరంలో గుండ కుటుంబానికి ఉన్న బలమైన పట్టును, సామాజికవర్గ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ఖర్చంతా పార్టీయే భరిస్తుందని హామీ ఇవ్వడంతో.. త్వరలో ఫ్యాన్ పార్టీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది.
Scroll for the next article