Telangana2nd Oct 05:36 PMSunil Byrisetty1 min read

దసరా వేడుకల్లో మాజీ సీఎం!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్ర

దసరా వేడుకల్లో మాజీ సీఎం!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర రావు నివాసంలో దసరా పండుగ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ దుర్గా మాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్ధించారు. మాజీ మంత్రి మహమూద్ అలీ కేసీఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Telangana
Festival Celebration
KCR
Kalvakuntla Chandrashekar Rao
BRS Party
Dasara 2025
Durga Puja
KTR
Family Celebration
దసరా వేడుకల్లో మాజీ సీఎం
బిఆర్‌ఎస్ పార్టీ
దసరా 2025
దుర్గాపూజ
Scroll for the next article