News29th Mar 06:21 PMSunil Byrisetty1 min read
ధర్మం అంటూ మాట్లాడిన పవన్ ఏమయ్యారు?
అంతర్జాతీయ గుర్తింపు ఉన్న తిరుమల పవిత్రత కూటమి ప్రభుత్వంలో మంటగలుస్తోందని మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యా
అంతర్జాతీయ గుర్తింపు ఉన్న తిరుమల పవిత్రత కూటమి ప్రభుత్వంలో మంటగలుస్తోందని మాజీ టీటీడీ బోర్డ్ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.
తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదినెలల కూటమి పాలనలో తిరుమలలో జరుగుతున్న అనాచారాలు శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నానన్న పవన్ కళ్యాణ్ ఈ దుర్మార్గాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
వైయస్సార్సీపీ అధికారంలో ఉండగా చిన్న అంశాలను కూడా భూతద్దంలో చూపించి తిరుమల పవిత్రతను మంట కలిపేశారని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చిలువలు పలవులుగా ప్రచారం చేశాయన్నారు.
అవే పార్టీలు అధికారంలోకి వచ్చాక ఇదే తిరుమల కేంద్రంగా వరుసగా అపశృతులు జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్టే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
పది నెలల పాలనతో తిరుమలను ఏకంగా గంజాయి కేంద్రంగా మార్చేశారన్నారు.
మద్యం అమ్మకాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయని ఆరోపించారు. అత్యంత పవిత్రమైన పాపవినాశనం జలాశయంలో బోటు షికారు చేయడంపై అధికారులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారన్నారు. పైగా అధికారులు పాపవినాశనంలో బోటు షికారు చేసిన వీడియోలను సరదాగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని ఆనందం పొందుతున్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.