Politics7th Oct 04:09 PMSunil Byrisetty1 min read
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు. విద్యతో
ఏపీ ప్రభుత్వంపై వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ..ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు. విద్యతో పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యం ప్రతి మనిషికి అవసరమైందన్నారు. ఆర్థిక పరిస్థితిని శ్వేతపత్రం రూపంలో ప్రజలకు తెలపాలని కోరారు. ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు.. ఎంత తిరిగి చెల్లిస్తున్నారన్నది ప్రకటించాలని అన్నారు. అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెర వేయాలన్నారు. సభలో లేనివారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదని వెంకయ్య అభిప్రాయపడ్డారు.