Politics22nd Aug 03:15 PMSunil Byrisetty1 min read

మంగళగిరి టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి టీడీపీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం మంగళగిరి గౌతమ బుద్ధా రోడ్డు, రహదారి బంగ్లా వద్ద నిర్వహించారు.

మంగళగిరి టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి టీడీపీ నాయకులు శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం మంగళగిరి గౌతమ బుద్ధా రోడ్డు, రహదారి బంగ్లా వద్ద నిర్వహించారు. మంత్రి లోకేష్ చొరవతో సర్వే నంబర్ 791/4లోని 50 సెంట్ల స్థలంలో జి+1 అంతస్తులతో నూతన టీడీపీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు. నూతన కార్యాలయంలో సుమారు 250 మంది కూర్చునే విధంగా ప్రత్యేక హాలు, పలు ఛాంబర్లు, కాన్ఫరెన్స్ రూమ్‌తో పాటు మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కోసం ప్రత్యేక ఛాంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కార్యాలయాన్ని ఆధునికంగా నిర్మించనున్నారు. అలాగే కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా హాజరయ్యారు.
Andhra Pradesh politics
Mangalagiri
TDP
Telugu Desam Party
TDP Office
TDP Office Construction
Nara Lokesh
మంగళగిరి నియోజకవర్గం
టీడీపీ నాయకులు
టీడీపీ కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
మంగళగిరి
Scroll for the next article