News5th Aug 01:04 PMSunil Byrisetty1 min read
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన
విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమిపూజ
విశాఖపట్నం అరిలోవ ప్రాంతంలోని తోటగరువులో భారతదేశ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు. పీవీ సింధు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్ లెన్స్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని వీక్షించారు. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు పాల్గొన్నారు.