News29th Jan 03:59 PMSunil Byrisetty1 min read
లంబసింగిలో టెంట్ సిటీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాభవాన్ని ప్రపంచపటంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాభవాన్ని ప్రపంచపటంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ 'అరకు ఉత్సవ్-2026' ను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లంబసింగిలో టెంట్ సిటీ, పోలవరం జిల్లా మారేడుమిల్లిలో హోమ్ స్టేల అభివృద్ధి ఏర్పాటు తదితర పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, స్థానిక కళాకారులను మంత్రులు సన్మానించారు. రాబోయే పదేళ్లలో "ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి" లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు.అరకు ఉత్సవ్ మన సంస్కృతిని కాపాడుతూ, మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.
రేపు (శుక్రవారం) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని వెల్లడించారు.