News14th Aug 11:48 AMSunil Byrisetty1 min read

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన

విజయవాడ ఆటోనగర్‌లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన
విజయవాడ ఆటోనగర్‌లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అప్పన రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు నూతన పార్టీ కార్యాలయ నిర్మాణ స్థలంలో కొబ్బరికాయ కొట్టి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండేలా నూతన కార్యాలయం నిర్మాణం జరగడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
NTR District TDP
Telugu Desam Party
TDP Office
Vijayawada
Autonagar
Gadde Anuradha
Sriram Rajagopal
Kesineni Sivanath
Nettem Raghuram
ఆచంట సునీత
టీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
టీడీపీ శంకుస్థాపన
పార్టీ కార్యాలయం
Scroll for the next article