News7th May 11:37 AMSunil Byrisetty1 min read

శంకర్ విలాస్ బ్రిడ్జికి శంకుస్థాపన

గుంటూరు నగరవాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి తొలి అడుగు పడింది. బ్రిడ్జికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష

శంకర్ విలాస్ బ్రిడ్జికి శంకుస్థాపన
గుంటూరు నగరవాసులకు ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించే శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి తొలి అడుగు పడింది. బ్రిడ్జికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ సేతబంధన్ పథకం కింద ఈ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. ఇప్పటి వరకు ఇరుకుగా ఉన్న ఈ వంతెన, కొత్త బ్రిడ్జి నిర్మాణంతో విశాలంగా మారనుంది. రూ. 98 కోట్ల నిధులు ఈ బ్రిడ్జి కోసం కేంద్రం విడుదల చేసింది. శంకుస్థాపన కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు గళ్ళ మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రవణ్ కుమార్, మేయర్ కోవెలమూడి నాని, కలెక్టర్ నాగలక్ష్మి, కమీషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.
Guntur Sankar Vilas Bridge
Minister Chandra Sekhar Pemmasani
Foundation Stone Laying
Nazeer Ahammad
ఎమ్మెల్యే గళ్ళ మాధవి
శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి తొలి అడుగు
కేంద్ర ప్రభుత్వ సేతబంధన్ పథకం కింద ఈ బ్రిడ్జి నిర్మాణం
Scroll for the next article