News13th Jul 04:40 PMSunil Byrisetty1 min read

దాల్మియా రెండవ ప్లాంట్ కు శంకుస్థాపన

కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్ కర్మగారం రెండవ ప్లాంట్ కు శంకుస్థాపన జరగనుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. జిల్లా పారిశ్రామికభివృద్ధిలో ప్రగతి పథంలో వ

దాల్మియా రెండవ ప్లాంట్ కు  శంకుస్థాపన
కడప జిల్లా జమ్మలమడుగులో దాల్మియా సిమెంట్ కర్మగారం రెండవ ప్లాంట్ కు శంకుస్థాపన జరగనుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. జిల్లా పారిశ్రామికభివృద్ధిలో ప్రగతి పథంలో వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భూపేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల వైకాపా పాలనలో జిల్లా అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఈ క్రమంలో అడ్డంకులను తొలగించి జె ఎస్ డబ్ల్యూ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం కూటమి పాలన చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. జె ఎస్ డబ్ల్యూ ఉక్కు కర్మాగారం తో పాటు నియోజకవర్గంలో సెయిల్ సోలార్ ప్రాజెక్టును ఇది వరకే నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించామని, ప్రస్తుతం దాల్మియా సిమెంట్ కర్మాగారం రెండవ ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుపుకోనుండటం జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తోందని తెలిపారు.
Andhra Pradesh
Dalmia Cement
Kadapa
Jammalamadugu
Industrial Development
Cement Plant
TDP
Chandrababu Naidu
నారా లోకేష్
జేఎస్‌డబ్ల్యూ స్టీల్
పరిశ్రమలు
పెట్టుబడులు
Scroll for the next article