News6th Nov 01:27 PMSunil Byrisetty1 min read
ఏపీలో కొత్తగా మరో నాలుగు జిల్లాలు?
ఏపీలో కొత్తగా మరో నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్లు, అభిప్రాయాలను మంత్రివర్గ ఉపసంఘం పరిగణనలోకి తీసుకుని చర్చిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మార్క
ఏపీలో కొత్తగా మరో నాలుగు జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల డిమాండ్లు, అభిప్రాయాలను మంత్రివర్గ ఉపసంఘం పరిగణనలోకి తీసుకుని చర్చిస్తున్న విషయం తెలిసిందే. దీంతో మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత తెలిపింది. నవంబర్ 10వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రానుంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు.. జిల్లాల సరిహద్దుల మార్పులపై క్లారిటీ రానుంది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకూ మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో ఆరు డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందులో.. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతోపాటు నక్కపల్లి, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.