News27th Oct 11:01 AMSunil Byrisetty1 min read
ఏపీలో కొత్తగా మరో 4 జిల్లాలు!
ఏపీలో అదనంగా 4 జిల్లాలు దాదాపు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఉన్నవాటిల్లోనూ మార్పులు ఖాయం అయ్యాయి. నాలుగు జిల్లాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ సహా మదనపల్లె కొత్
ఏపీలో అదనంగా 4 జిల్లాలు దాదాపు ఖరారయ్యాయి. ప్రస్తుతం ఉన్నవాటిల్లోనూ మార్పులు ఖాయం అయ్యాయి. నాలుగు జిల్లాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ సహా మదనపల్లె కొత్త జిల్లాలు కానున్నాయి. 10 కొత్త రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు మండలాలు.. జిల్లాల్లో మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. వీటికి తుది రూపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో జరిగే సమావేశం లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాత నవంబరు 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.