News13th Aug 01:40 PMSunil Byrisetty1 min read
హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. హైకోర్టులో ఇప్పటి వరకూ జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ(కిరణ్మయి కనపర్తి), జస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. హైకోర్టులో ఇప్పటి వరకూ జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ(కిరణ్మయి కనపర్తి), జస్టిస్ సుమతి జగడం,జస్టిస్ న్యాపతి విజయ్ అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్నారు. వీరిని న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా బుధవారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో న్యాయమూర్తులుగా ప్రమాణం స్వీకారం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం తదితరులు పాల్గొన్నారు.