Politics10th Jan 03:55 PMSunil Byrisetty1 min read
ఏపీలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాలు!
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీ కాలం జూన్ నెలతో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తు
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు సభ్యుల పదవీ కాలం జూన్ నెలతో ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఏప్రిల్‌లోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం, ఈ నాలుగు స్థానాలు క్లీన్ స్వీప్‌గా అధికార తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం నాలుగు స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలంగా ఉన్న వైసీపీ, వరుసగా సభ్యుల రాజీనామాలు, పదవీ కాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతోంది. ఈ నాలుగు స్థానాల్లో చోటు దక్కించుకోవాలని సీనియర్లు దేవినేని ఉమ, గల్లా జయదేవ్, చింతకాయల విజయ్, మహాసేన రాజేశ్, ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. జనసేన నుంచి ఆ పార్టీ కీలక నేతలకు లేదా అధినేత పవన్ కళ్యాణ్ సూచించిన వ్యక్తికి అవకాశం దక్కవచ్చు. ఈ నాలుగు సీట్లూ కూటమికి దక్కడం ద్వారా, కేంద్రంలో ఎన్డీయే బలం మరింత పెరగనుంది.