News14th May 04:30 PMSunil Byrisetty1 min read
మసులా ఫెస్ట్ కోసం వెల్డింగ్ చేసిన మంత్రి!
జూన్ మొదటి వారంలో 4 రోజులపాటు మసులా ఫెస్ట్ పేరుతో మంగినపూడి బీచ్ ఉత్సవాలను నిర్వహించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీం
జూన్ మొదటి వారంలో 4 రోజులపాటు మసులా ఫెస్ట్ పేరుతో మంగినపూడి బీచ్ ఉత్సవాలను నిర్వహించడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు.
కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను మంత్రి పరిశీలించారు.
మంత్రి స్వయంగా తోరణాల వెల్డింగ్ పనులను చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
తదుపరి మంత్రి అక్కడ ధర్మాకోల్‌తో తయారు చేస్తున్న గౌతమ బుద్ధుడు, ఆక్టోపస్, డాల్ఫిన్, ఎండ్రకాయ, నక్షత్ర చేప, వివిధ రకాల చేపలు, తాబేలు, శంఖం, తదితర సముద్ర జీవులు, పాండురంగ స్వామి ఆకారాలతో బొమ్మలను పరిశీలించారు.