Health11th Aug 05:14 PMSunil Byrisetty1 min read

"సుజనా ఫౌండేషన్" ఆధ్వర్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి "సుజనా ఫౌండేషన్" ఆధ్వర్యంలో గర్భిణుల కోసం ప్రారంభించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టినగర్ లో

"సుజనా ఫౌండేషన్" ఆధ్వర్యంలో గర్భిణులకు వైద్య పరీక్షలు
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి "సుజనా ఫౌండేషన్" ఆధ్వర్యంలో గర్భిణుల కోసం ప్రారంభించిన ఉచిత మొబైల్ 2డీ ఎకో హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులకు విశేష స్పందన లభిస్తోంది. చిట్టినగర్ లోని ,సర్కిల్ వన్ కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన ఈ ఉచిత హెల్త్ స్క్రీనింగ్ లను స్థానిక మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత హెల్త్ స్క్రీనింగ్ ల ద్వారా మహిళలో గర్భధారణ సమయంలో వచ్చే గుండె జబ్బులు ముందుగానే గుర్తించి ప్రాణాంతక సమస్యలను నివారించడం సాధ్యమవుతుంది. పేద, మధ్య తరగతి మహిళలు , గర్భిణీల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఎటువంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నస్టిక్ సేవలను పేదల ముంగిటకే చేర్చాలని "సుజనా ఫౌండేషన్" లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 28 మంది గర్భిణులకు 2డీ ఎకో మాటర్నల్ కార్డియాక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.
Andhra Pradesh
Sujana Foundation
Sujana Chowdary
Vijayawada
Pregnant Women
Maternal Health
2D Echo
Cardiac Screening
Maternal Cardiac Risk
ఉచిత వైద్య శిబిరం
మొబైల్ హెల్త్ స్క్రీనింగ్
మహిళల ఆరోగ్యం
వైద్య సేవలు
Scroll for the next article