Spiritual25th Nov 05:49 PMSunil Byrisetty1 min read
భక్తులందరికీ ఉచితంగా అంతరాలయ దర్శనం
శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం సర్వ దర్శనం(ఉచిత దర్శనం) క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ట్రయల్ రన్ మంగళవారం మధ్యాహ్నం రాహుకాల సమయం ప్రారంభం
శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం నిమిత్తం సర్వ దర్శనం(ఉచిత దర్శనం) క్యూలైన్ లో వచ్చే భక్తులకు ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించే దిశగా ట్రయల్ రన్ మంగళవారం మధ్యాహ్నం రాహుకాల సమయం ప్రారంభం అయిన 3 గంటల నుంచి ఒక గంట సేపు జరిగింది. ఉచిత దర్శనం క్యూలైను ను ధర్మకర్తలమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వీకే శీనానాయక్ స్వయంగా అంతరాలయ దర్శనం లైన్ లోకి మళ్లించారు. ఉచిత దర్శనంలో వెళుతున్న భక్తులకు ఒక్కసారిగా అంతరాలయ దర్శనం కల్పించడంతో ఆనందం వ్యక్తం చేశారు. 3 గంటల నుంచి 4 గంటల వరకు సుమారు 1500 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం భక్తులను కొద్దిసేపు అంతరాలయం దర్శనం ఏర్పాటు చేసే విషయంలో ప్రయోగాత్మకంగా మంగళవారం చూసినట్లు, తదుపరి ధర్మకర్తల మండలిలో చర్చించి దేవదాయ శాఖ మంత్రి, దేవదాయ కమిషనర్ ఆమోదంతో ఎలా ముందుకు సాగాలనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు. సామాన్య భక్తులకు ఇలా ఆకస్మికంగా అంతరాలయ దర్శనం కల్పించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.