Health17th Sep 05:22 PMSunil Byrisetty1 min read
ఆయుర్వేద వైద్యంతో ఆరోగ్య పరిరక్షణకు భరోసా
జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని “రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం” అనే నినాదంతో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన, ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వే
జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని “రేపటి ఆరోగ్యం కోసం ఆయుర్వేదం” అనే నినాదంతో ప్రజలకు వ్యాధుల నివారణపై అవగాహన, ఉచిత వైద్య సేవలను అందించనున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా.పి.జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గురువారం సత్యనారాయణపురం శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్ద ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. శిబిరంలో మొత్తం 515 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలకు అనుగుణంగా ఆయుర్వేద వైద్య సలహాలు అందించడం జరిగిందన్నారు. ప్రధానంగా కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, పైల్స్, చర్మ వ్యాధులు, స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులు అందజేసినట్లు తెలిపారు.