TTD20th Aug 01:13 PMSunil Byrisetty1 min read

తిరుమ‌ల కొండ పైకి ఉచిత బ‌స్సు సౌకర్యం

ఈ నెల 15 నుంచి ఏపీలో 'స్త్రీ శ‌క్తి' పేరుతో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సౌక‌ర్యాన్ని

తిరుమ‌ల కొండ పైకి ఉచిత బ‌స్సు సౌకర్యం
ఈ నెల 15 నుంచి ఏపీలో 'స్త్రీ శ‌క్తి' పేరుతో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌కు ఉచిత ఆర్‌టీసీ బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ సౌక‌ర్యాన్ని తిరుమ‌ల కొండ పైవ‌ర‌కు పొడిగించిన‌ట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ఛైర్మ‌న్ కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు వెల్ల‌డించారు. అయితే, ఘాట్ రోడ్డు కార‌ణంగా సిటింగ్ వ‌ర‌కే అనుమ‌తి ఇస్తున్న‌ట్లు తెలిపారు. కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ బ‌స్సు డిపోను ఎమ్మెల్యే మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌, ఆర్టీసీ ఆర్ఎం కే వెంక‌టేశ్వ‌ర‌రావుతో క‌లిసి ఆయ‌న ప‌రిశీలించారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. 'స్త్రీ శ‌క్తి'-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కానికి అపూర్వ స్పంద‌న వ‌స్తున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16న 10 ల‌క్ష‌ల మంది, 17న 15 ల‌క్ష‌ల మంది, 18న 18 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం చేశారని కొన‌క‌ళ్ల నారాయ‌ణరావు చెప్పారు.
Andhra Pradesh Government
Tirumala
APSRTC
Free Bus Service
Stree Shakti Scheme
Women Welfare
Public Transport
Konakalla Narayana Rao
RTC
Women Empowerment
Free Travel
తిరుమ‌ల కొండ పైకి ఉచిత బ‌స్సు సౌకర్యం
Scroll for the next article