Politics17th Jan 05:49 PMSunil Byrisetty1 min read

మహిళలకే కాదు.. పురుషులకూ ఫ్రీ బస్!

రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తుంటే ఉచిత హామీలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐడీఎంకే పార్టీ విడుదల చేసింది. ప్రతి మహిళకు నెలకు రూ.2

మహిళలకే కాదు.. పురుషులకూ ఫ్రీ బస్!
రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తుంటే ఉచిత హామీలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐడీఎంకే పార్టీ విడుదల చేసింది. ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ఇస్తామని పేర్కొంది. సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని ప్రకటించింది. అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించింది. 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.
Indian politics
Tamil Nadu Elections
AIADMK Manifesto
Free Bus Travel
Election Promises
Welfare Schemes
Monthly Allowance for Women
అమ్మ టూ వీలర్ పథకం
గ్రామీణ గృహాలు
ఉపాధి హామీ పథకం
రాజకీయాలు
Scroll for the next article