News5th Dec 03:02 PMSunil Byrisetty1 min read

వికలాంగులకూ ఉచిత బస్సు

ఆంధ్రాలో మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రక

వికలాంగులకూ ఉచిత బస్సు
ఆంధ్రాలో మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, టిడ్కో ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు సహా ఏడు వరాలు వారికి ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా కూడా దివ్యాంగులకు ఆరువేల రూపాయలు పింఛన్ ఇవ్వడం లేదని చంద్రబాబు వెల్లడించారు.
Andhra Pradesh
Free Bus Travel
Disabled Welfare
Divyangula Sankshema
Chandrababu Naidu
ఏపీ ప్రభుత్వం
సామాజిక సంక్షేమం
ఆర్టీసీ బస్సులు
సంక్షేమ పథకాలు
Scroll for the next article