News16th Aug 04:12 PMSunil Byrisetty1 min read
ఉచిత బస్ ప్రయాణం చేయాలంటే.. ఇవి తప్పనిసరి!
ఉచితంగా ప్రయాణం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి. అందుకు తగిన ప్రూఫ్ చూపించాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక ఫొటో ఉన్న గుర్తింపు కార్డు కండక
ఉచితంగా ప్రయాణం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి. అందుకు తగిన ప్రూఫ్ చూపించాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక ఫొటో ఉన్న గుర్తింపు కార్డు కండక్టర్కు చూపించిన తర్వాతే టికెట్ ఇస్తారు.
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం గుర్తించే ఇతర కార్డులు
కార్డుపై మీ ఫొటో కచ్చితంగా ఉండాలి. కార్డుపై మీ స్థానికతను తెలియజేసే అడ్రెస్ ఉండాలి.
జిరాక్స్ కాపీలు చెల్లవు.
ఒరిజినల్ కార్డులను మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు.
విద్యార్థులయితే స్కూల్లో ఇచ్చిన ఐడీ కార్డు చూపించాలి
వీటిలో ఏది లేకపోయినా, Xerox కాపీలు, ఫోన్లో చూపించడం ఒప్పుకోరు. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. జీరో ఫెయిర్ టికెట్ ఇస్తారు. ఇంద్రా ఏసీ, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఇతర రాష్ట్రాలకు నడిపే సర్వీసులకు ఉచిత పథకం వర్తించదు.