News12th Jul 02:27 PMSunil Byrisetty1 min read

సమయపాలలేని వృత్తి జర్నలిజం

సమయపాలన లేని వృత్తి జర్నలిజం అని నిద్రాహారాలు మానేసి జర్నలిస్టులు ప్రజాసేవలో నిమగ్నమై ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్

 సమయపాలలేని వృత్తి జర్నలిజం
సమయపాలన లేని వృత్తి జర్నలిజం అని నిద్రాహారాలు మానేసి జర్నలిస్టులు ప్రజాసేవలో నిమగ్నమై ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ విజయవాడ ప్రెస్ క్లబ్ సంయుక్తంగా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. హైదరాబాదులో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ కి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ కి ఎన్నో రకాల టెస్టులు ,ఔషధాలు వచ్చాయని తెలిపారు. శరీరంలో వచ్చే లక్షణాలను బట్టి ఏ అవయవంలో అసాధారణ రీతిలోలో లక్షణం కనిపిస్తుందో దానిని నిర్ధారించడం జరుగుతుందన్నారు. మిగతా హాస్పిటల్స్ కన్నా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవా తత్పరత చాటుకుంటుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద 140 రకాల వ్యాధులకు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రాథమికంగానే రోగ నిర్ధారణ జరిగితే క్యాన్సర్‌ను నియంత్రించవచ్చని తెలిపారు. పాఠశాలలో, కాలేజీలో విద్యాపరంగా క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన కల్పించేలా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు.
Andhra Pradesh news
Vijayawada
free cancer diagnosis camp
MLA Bonda Umamaheswara
American Hospital
NTR Vaidya Seva
ఎన్టీఆర్ వైద్య సేవ కింద 140 రకాల వ్యాధులకు వైద్య సేవలు
Scroll for the next article