Education15th Sep 05:57 PMSunil Byrisetty1 min read
బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్ సర్వీసెస్ శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ భవన్ నందు గల 'ఏపీ స్టేట్ స్టడీ సర్కిల్' ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి వెనుకబడిన తరగతుల (బీసీ) అ
రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని బీసీ భవన్ నందు గల 'ఏపీ స్టేట్ స్టడీ సర్కిల్' ద్వారా 2026–27 విద్యా సంవత్సరానికి వెనుకబడిన తరగతుల (బీసీ) అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ మరియు మెయిన్స్) ఉచిత శిక్షణ (3వ బ్యాచ్) అందించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయటం జరిగిందని సంచాలకులు డా. ఏ మల్లికార్జున తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హత గలిగిన ప్రముఖ శిక్షణా సంస్థల నుండి ఆన్‌లైన్ టెండర్లను ఆహ్వానిస్తున్నారన్నారు. ఆన్‌లైన్ షార్ట్ టెండర్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది అన్నారు. టెండర్ల దాఖలుకు ఈనెల17 ఆఖరి తేదీ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ-బిడ్ సమావేశం అక్టోబర్ 1న నిర్వహిస్తామని, టెండర్ల పరిశీలన మరియు ఖరారు ప్రక్రియ అక్టోబర్ 5న నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు https://tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చునని మల్లిఖార్జున తెలిపారు.