Education12th Oct 05:35 PMSunil Byrisetty1 min read

పీ4లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్

దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్ లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం ప్రఖ్యాత గాంచిన డా. లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీతో బ

పీ4లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ కోచింగ్
దేశంలోనే తొలిసారిగా పీ4 మోడల్ లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం ప్రఖ్యాత గాంచిన డా. లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీతో బీసీ సంక్షేమ శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ సందర్భంగా మెటీరియల్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అభ్యర్థులకు నిష్ణాతులైన అధ్యాపకులు బోధించనున్నట్లు తెలిపారు. సచివాలయంలోని మంత్రి సవిత సమక్షంతో డా. లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ ముందు ఉంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా బీసీల కులాల సంక్షేమానికి పలు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. బీసీ యువత ఉన్నత స్థానాల్లో కొలువుదీరాలన్న ఉద్దేశంతో సివిల్స్ సర్వీసెస్, డీఎస్సీ, గ్రూప్ 1, పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల కోసం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ అందజేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీ4 మోడల్ లో బీసీ యువతకు ఉచిత సివిల్స్ శిక్షణ అందించడానికి దేశంలో ప్రఖ్యాత గాంచిన డా. లక్ష్మయ్య ఐఎఎస్ అకాడమీ ముందుకు రావడం అభినందనీయమన్నారు.
Scroll for the next article