Education20th Jul 08:50 AMSunil Byrisetty1 min read
అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ తో శిక్షణ
ఏపీలో త్వరలో నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. రాష్ట్రంలోని విజ
ఏపీలో త్వరలో నిరుద్యోగ ఎస్సీ,ఎస్టీ యువతకు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం,తిరుపతి కేంద్రాల్లో శిక్షణనిస్తామన్నారు.
బ్యాంక్ PO, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ (RRB) పోటీ పరీక్షలకు శిక్షణ ఉంటుందని తెలిపారు.
అభ్యర్థుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల్ని నిరుద్యోగ ఎస్సి,ఎస్టీ యువత అందిపుచ్చుకోవాలని సూచించారు.
ఎస్సి, ఎస్టీ యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.